స్నేహితుడికి ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-10-18T05:05:21+05:30 IST

తనతో పాటు చదువుకొని ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుడికి అతని మిత్రులు ఆర్థికసాయం చేసి స్నేహమంటే ఇదేరా అనిపించుకున్నారు. వివరాల్లోకెళ్తే.. చెన్నూరుకు చెందిన అనుగోలు శంకరయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కాలం వెల్లదీసేవాడు.

స్నేహితుడికి ఆర్థికసాయం
శంకరయ్యకు ఆర్థికసాయం అందజేస్తున్న దృశ్యం

చెన్నూరు, అక్టోబరు 17: తనతో పాటు చదువుకొని ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుడికి అతని మిత్రులు ఆర్థికసాయం చేసి స్నేహమంటే ఇదేరా అనిపించుకున్నారు. వివరాల్లోకెళ్తే.. చెన్నూరుకు చెందిన అనుగోలు శంకరయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కాలం వెల్లదీసేవాడు. గత కొంతకాలంగా షుగర్‌ వ్యాధి, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతూ చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌లో చేరాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు మండల టీడీపీ మైనార్టీ నేత కరీమ్‌, మాజీ సైనికుడు రాజ, చిన్నబాసుపల్లికి చెందిన సుబ్బారావు, తదితరులు ఆసుపత్రికి వెళ్లి రూ.20 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. 

Updated Date - 2021-10-18T05:05:21+05:30 IST