కొత్త ఇంటర్నెట్‌ కనెక్షనా...ఇవి తెలుసుకోండి!

ABN , First Publish Date - 2021-05-15T05:30:00+05:30 IST

కొవిడ్‌తో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. వీలైనంత వరకు ఇంటి నుంచే పనిచేస్తున్నారు.చదువులూ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి

కొత్త  ఇంటర్నెట్‌ కనెక్షనా...ఇవి తెలుసుకోండి!

కొవిడ్‌తో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. వీలైనంత వరకు ఇంటి నుంచే పనిచేస్తున్నారు.చదువులూ ఆన్‌లైన్‌లోనే సాగుతున్నాయి.ఈ క్రమంలో కొత్త కనెక్షన్‌ తీసుకోవడం, ఉన్న కనెక్షన్‌ స్పీడ్‌ పెంచుకోవాలనుకుంటున్నారా...  ఈ కింది విషయాలపై దృష్టిపెట్టాలంటున్నారు సైబర్‌ నిపుణులు. నిజానికి ఈ మధ్య కాలంలో అందుబాటు రేట్లకే ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ తీసుకునే వీలుంది. అసలు అది ఎంత రేటుకు వస్తుందో, వేగం ఎంతుందో వంటి అంశాలకు తోడు మరికొన్నింటినికూడా తెలుసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. 

  • ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోసం ఆరంభంలో ఎంత చెల్లించాలో ముందు సదరు ప్రొవైడర్‌ను అడిగి తెలుసుకోండి. అందులోనే ఇన్‌స్టాలేషన్‌(కనెక్షన్‌ ఇచ్చేందుకు  మెటీరియల్‌ తదితరాల కోసం అయ్యే ఖర్చు), అడ్వాన్స్‌(ముందస్తు చెల్లింపు), పన్నులు, కొన్ని సందర్భాల్లో రౌటర్‌ - మోడెమ్‌ వ్యయాలన్నీ ఉంటాయి. బ్రాండ్‌ను బట్టి ఈ వ్యయాల్లో తేడాలు ఉంటాయి, అవన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి.
  • మోడెమ్‌ ఉచితంగా ఇస్తారా లేదా ప్రత్యేకించి కొనుగోలు చేసుకోవాలా అన్నది తెలుసుకోండి.  మోడెమ్‌ను ఉచితంగా ఇచ్చినపక్షంలో  కనెక్షన్‌ వద్దనుకున్నప్పుడు అది తిరిగి ఇచ్చేయాలా అన్నది తెలుసుకోవాలి. మోడెమ్‌కు సంబంధించి ఏదైనా రిఫండబుల్‌ అమౌంట్‌ ఉందా అన్నదానిపై దృష్టిపెట్టాలి.
  • మోడెమ్‌ ఏ తరహా అంటే డ్యూయల్‌ బ్యాండ్‌(2.5జిహెచ్‌జెడ్‌,  5జిహెచ్‌జెడ్‌) రౌటరా కాదా తెలుసుకోవాలి. బ్రాండ్‌, మోడల్‌ నేమ్‌, స్పెసిఫికేషన్స్‌ కూడా తెలుసుకోవాలి. 
  • సిమ్మిట్రిక్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ అంటే అప్‌లోడ్‌, డౌన్‌లోడ్‌కు ఒకే వేగం ఉంటుంది. సాధారణంగా అప్‌లోడ్‌తో పోల్చుకుంటే డౌన్‌లోడ్‌ వేగం ఎక్కువగా ఉంటుంది.  వినియోగదారుడు అప్‌లోడ్‌ వేగం ఎక్కువగా ఉండాలని భావిస్తాడు. పంపిన డాక్యుమెంట్‌ లేదంటే మరొకటి గమ్యానికి తొందరగా చేరాలని అనుకుంటాడు. 
  • పీక్‌ స్పీడ్‌, అత్యంత గరిష్ఠ వేగం అంటూ ప్రొవైడర్లు సాధారణంగా గొప్పలు చెబుతారు. అవేమంత నిజం కాదు. అందువల్ల యావరేజ్‌ స్పీడ్‌ ఎంత అని అడిగి తెలుసుకోవడం మంచి పద్ధతి 
  • ప్రతీ ఇంట్లో మనిషికి ఒక స్మార్ట్‌ ఫోన్‌ ఉండడం సహజం అయింది. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే దానికి నెట్‌ అవసరం. అందుకే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకునేప్పుడు అది ఎన్ని డివైజెస్‌లకు సదరు నెట్‌ యావరేజ్‌ స్పీడ్‌ అందుతుందో కూడా తెలుసుకోండి. ఎక్కువ డివైజస్‌లను ఒకే కనెక్షన్‌తో ఉపయోగించుకున్నప్పుడు వేగం తగ్గుతుంది. కుటుంబంలోని సభ్యులంతా ఒకటే కనెక్షన్‌తో పనిచేసుకుంటూ ఉంటే ఈ విషయంలో స్పష్టత అవసరం. ఈ లాక్‌డౌన్‌లో ఇంటినుంచే అందరూ పనిచేస్తున్నందున వ్యక్తుల పని, అవసరాన్నిబట్టి ఉపయోగాన్ని విభజించుకోవచ్చు. 
  • అన్‌లిమిటెడ్‌ నెట్‌ ఉంటే ఫర్వాలేదు. కానీ లేకుంటే మాత్రం నెట్‌ డేటా రోల్‌ఔట్‌ సదుపాయం ఉందా లేదా అన్నది తేల్చుకోండి. అంటే ఈ నెలలో వినియోగించుకోని డేటా తదుపరి మాసంలో ఉపయోగించుకోవచ్చా లేదా అన్నది స్పష్టం కావాలి.
  • సొంతంగా మార్కెట్‌ రీసెర్చ్‌ చేసుకోవాలి. అంటే చుట్టుపక్కల ఇదే ప్రొవైడర్‌ నుంచి కనెక్షన్‌ పొందిన   వ్యక్తుల అనుభవాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రాంతాలనుబట్టి ఐఎ్‌సపిలో తేడాలు ఉంటాయి. 
  • కస్టమర్‌ సపోర్ట్‌, ఏదైనా ఫిర్యాదు చేస్తే పరిష్కారానికి తీసుకునే సమయం కూడా తెలుసుకోవాలి. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పొందే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పాయింట్‌ ఇది. దీనికి కూడా చుట్టుపక్కల కనెక్షన్‌ ఉన్న వ్యక్తులు, సోషల్‌ మీడియా నుంచి  సమాచారం పొందవచ్చు, చెక్‌ చేసుకోవచ్చు. 
  • చాలా వరకు ఐఎ్‌సపీలు ఈ మధ్య కాలంలో ఒటీటీతో కనెక్షన్‌ కలిగి ఉంటున్నాయి. కొత్తగా కనెక్షన్‌ తీసుకునే సమయంలో అలాంటి వెసులుబాట్లు ఏమైనా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోండి.

  • ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కోసం ఆరంభంలో ఎంత చెల్లించాలో ముందు సదరు ప్రొవైడర్‌ను అడిగి తెలుసుకోవాలి
  • మోడెమ్‌ ఏ తరహా అంటే డ్యూయల్‌ బ్యాండ్‌(2.5జిహెచ్‌జెడ్‌,  5జిహెచ్‌జెడ్‌) రౌటరా కాదా తెలుసుకోవాలి.
  • నెలలో వినియోగించుకోని డేటా తదుపరి మాసంలో ఉపయోగించుకోవచ్చా లేదా అన్నది స్పష్టం కావాలి.

Updated Date - 2021-05-15T05:30:00+05:30 IST