మాస్కు ఎక్కడ తల్లీ...?

ABN , First Publish Date - 2021-07-30T05:16:41+05:30 IST

నెల్లూరు నగరంలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి కార్పొరేషన్‌ అధికారులు గురువారం జరిమానాలు విధించారు. ముఖ్యంగా మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి ఫైన్‌ వేసి మరో సారి మాస్క్‌ లేకుండా బయ టకు రావొద్దని హెచ్చరించారు.

మాస్కు ఎక్కడ తల్లీ...?
మాస్కు ఎక్కడని మహిళని ప్రశ్నిస్తున్న ఎంహెచ్‌వో వెంకట రమణయ్య

 నగరంలో ‘కరోనా’ ఉల్లంఘనులకు జరిమానా

నెల్లూరు (సిటీ), జూలై 29 : నెల్లూరు నగరంలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి కార్పొరేషన్‌ అధికారులు గురువారం జరిమానాలు విధించారు. ముఖ్యంగా మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి ఫైన్‌ వేసి మరో సారి మాస్క్‌ లేకుండా బయ టకు రావొద్దని హెచ్చరించారు. ఎంహెచ్‌వో వెంకట రమణయ్య నేతృత్వంలోని శానిటే షన్‌ ఇన్‌స్పెక్టర్లు, సెక్రటరీలు వలంటీర్లతో కలిసి బృందాలుగా ఏర్పడి రోడ్లపై తనిఖీలు నిర్వహించారు. మాస్కులు లేని వారికి రూ.100 చొప్పున జరిమానా  విధించారు. ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే వారిని సైతం గుర్తించి అపరాధ రుసుము కట్టించా రు. దుకాణాల వద్ద భౌతిక దూరం లేకపోవడం, గుంపులుగా ఉండటం, చెత్తకుండీలు ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో అనేక మంది వ్యాపారులకు జరిమానా విధించినట్లు ఎంహెచ్‌వో తెలిపారు. కాగా, మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.100 జరిమానా కట్టాల్సిందేనని కమిషనర్‌ దినేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-30T05:16:41+05:30 IST