Abn logo
Sep 27 2021 @ 23:58PM

కొండ మీద వేలిముద్ర.. ఊర్లో రేషన్‌

కొండ సమీపంలో రాత్రి వేళ బయోమెట్రిక్‌ మిషన్‌తో ఉన్న ఇన్‌చార్జి డీలర్‌

డోన్‌, సెప్టెంబరు 27: డోన్‌ మండలం మల్లెంపల్లె గ్రామస్థులు రేషన్‌ కోసం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వేలిముద్ర ఒక చోట వేసి.. రేషన్‌ మరోచోట తీసుకోవాల్సి వస్తోంది. మల్లెంపల్లె గ్రామానికి బోయ బొంతిరాళ్ల గ్రామ డీలర్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. బయోమెట్రిక్‌ మిషన్‌ పని చేయడం లేదని, కొండ సమీపంలోకి వేలిముద్రలకు రావాలని మల్లెంపల్లె గ్రామస్థులకు ఇన్‌చార్జి డీలర్‌ కబురు పంపారు. దీంతో సోమవారం రాత్రి రేషన్‌ కార్డుదారులు కొండ సమీపానికి వెళ్లి వేలిముద్రలు వేయాల్సి వచ్చిందని గ్రామస్థులు వాపోయారు. అక్కడ వేలిముద్రలు వేసి వచ్చిన తర్వాత గ్రామంలో రేషన్‌ తీసుకోవాల్సి వచ్చింది.