‘ఆసరా’కు ఎసరు

ABN , First Publish Date - 2021-09-16T05:30:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రకరకాల సాకులతో కొత్త నిబంధనలు పెట్టి లబ్ధిదారులకు అందించే సంక్షేమ పఽథకాల్లో కోత పెడుతోంది. ఇందులో భాగంగానే అమ్మఒడి, విద్యాదీవెన, చేయూత, నేతన్న నేస్తం, రేషన్‌, వైఎ్‌సఆర్‌ పెన్షన్‌ కానుకలకు కోతలు పెట్టింది. ఇదే కోవలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకమైన ‘వైఎ్‌సఆర్‌ ఆసరా’కు ఎసరు

‘ఆసరా’కు ఎసరు
పొదుపు మహిళల వేలిముద్రలు తీసుకుంటున్న మెప్మా ఆర్‌పీలు

వేలిముద్రలు వేస్తేనే ఆసరా సాయం

రెండు రోజుల గడువుతో మెప్మా ఆర్‌పీలకు ఇక్కట్లు

మొదటి విడతలో లక్షల మందికి రూ.92.35 కోట్ల లబ్ధి

రెండో విడతఅందరికీ దక్కేనా

ప్రొద్దుటూరు అర్బన్‌, సెప్టెంబరు 16: రాష్ట్ర ప్రభుత్వం రకరకాల సాకులతో కొత్త నిబంధనలు పెట్టి లబ్ధిదారులకు అందించే సంక్షేమ పఽథకాల్లో కోత పెడుతోంది. ఇందులో భాగంగానే అమ్మఒడి, విద్యాదీవెన, చేయూత, నేతన్న నేస్తం, రేషన్‌, వైఎ్‌సఆర్‌ పెన్షన్‌ కానుకలకు కోతలు పెట్టింది. ఇదే కోవలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకమైన ‘వైఎ్‌సఆర్‌ ఆసరా’కు ఎసరు పెట్టింది. పొదుపు మహిళలు వేలిముద్రలు వేస్తేనే ఆసరా వర్తింపచేయాలని నిబంధన పెట్టింది. ఈ నిబంధన ప్రకారం వేలిముద్రలు వేయకపోతే ఆసరా వర్తించదు.


కోతకే యాప్‌లో నమోదు

ప్రభుత్వం ఈ నెలలో డ్వాక్రా మహిళలకు రెండో విడత రుణమాఫీ డబ్బులను ఆసరా పథకం కింద ఇవ్వనుంది. ఇందులో వేలిముద్రల నిబంధనతో ఆసరాలో కోతకు రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా రుణమాఫీకి అర్హత ఉన్న డ్వాక్రా మహిళలతో ఈనెల 16వ తేదీలోపు వేలిముద్రల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కేవలం రెండురోజుల సమయం ఇచ్చి వేల మంది డ్వాక్రా మహిళలకు వేలిముద్రలు యాప్‌లో నమోదు చేయాలనడంతో మెప్మా ఆర్‌పీలు ఆపసోపాలు పడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో వేలాదిమంది వేలిముద్రలు యాప్‌లో నమోదు చేయడం కష్ట సాధ్యమని తెలిసే అధికారులు ఈ నిబంధన తెరపైకి తెచ్చినట్లు పలువురు వాపోతున్నారు. అంతేకాక యాప్‌లు సరిగా పనిచేయడం లేదని ఆరోపిస్తున్నారు.మెప్మా ఆర్‌పీలకు కాకుండా సీవోలకు లాగిన్‌లు ఇవ్వడంతో ఒక్కొక్క సీవో పది స్లమ్‌ సమాఖ్యలకు తిరిగి లాగిన్‌ అవ్వవలసి వస్తోందని మెప్మా సిబ్బంది వాపోతున్నారు. ఆర్‌పీ మహిళల వేలిముద్రల ప్రక్రియ చేపట్టే సమయంలో సర్వర్‌ ఇబ్బందులు వస్తే తిరిగి మళ్లీ సీవోని రప్పించి లాగిన్‌ కావాల్సిన పరిస్థితి ఉంటోంది. రెండు రోజుల్లో రకరకాల కారణాలతో వేలిముద్రలకు అందుబాటులో లేని డ్వాక్రా మహిళల పరిస్థితి ఏంటని అడిగితే అధికారుల నుంచిస్పష్టమైన సమాచారం లేదు.


త్వరితగతిన పూర్తిచేయమన్నాం..

- రామ్మోహన్‌ రెడ్డి, మెప్మా పీడీ

జిల్లాలోని 9 మున్సిపాలిటీల్లోమొత్తం 15,024 పొదుపు సంఘాలున్నాయి. అందులో 10,578 గ్రూపులు ఆసరాకు అర్హులు. ఈ గ్రూపులకు మొత్తం రూ.369.40 కోట్లు రుణమాఫీలో మొదటివిడతగా రూ.92.35 కోట్లు మంజూరు అయింది. రెండవ విడత ఆసరా డబ్బులు గ్రూపు ఖాతాల్లో కాకుండా నేరుగా సభ్యుల ఖాతాల్లో జమచేయాలని వేలిముద్రలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. గతంలో గ్రూపు ఖాతాల్లో డబ్బులు వేసినందున బ్యాంక్‌ తాము ఇచ్చిన రుణాలకు ఆసరా డబ్బులు జమచేసుకోవడంతో ప్రభుత్వం ఈ పర్యాయం నేరుగా ఖాతాల్లో జమచేస్తుందని చెబుతున్నారు. అయితే ఇది అధికారిక సమాచారంకాదు. ఈ నెలలో ఆసరా డబ్బులు వేస్తారు కనుక త్వరితగతిన పూర్తిచేయమన్నాం.

Updated Date - 2021-09-16T05:30:00+05:30 IST