ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-06-24T07:02:18+05:30 IST

జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు.

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
కొనుగోలు కేంద్రంలో ధాన్యం

-   3.61 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ 

- లక్ష్యం కంటే 11 వేల మెట్రిక్‌ టన్నులు అదనం 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారు.  3.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. మొత్తం 234 కొనుగోలు కేంద్రాల ద్వారా 50,398 మంది రైతుల నుంచి రూ .681.75 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు.  యాసంగిలో జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా అదనంగా 11 వేల మెట్రిక్‌ టన్నులు సేకరించారు. గత  యాసంగి సీజన్‌ కంటే 1.16 లక్షల మెట్రిక్‌ టన్నులు ఈ సారి అదనంగా కొనుగోలు చేశారు. 2019- 20 యాసంగి సీజన్‌లో 5,0,574 మంది రైతుల నుంచి 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత సీజన్‌ 2020-2021 సంబంధించి 5,0,398 మంది రైతుల నుంచి 3.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా 84,137 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ విండోల ద్వారా 2,55,330 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ద్వారా 8,496 మెట్రిక్‌ టన్నులు, మెప్మాద్వారా 3,933 మెట్రిక్‌ టన్నులు, మార్కెట్‌ యార్డుల ద్వారా 9,206 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రూ. 681.75 కోట్ల ఽవిలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇప్పటి వరకు 4,43,89 మంది రైతుల ఖాతాల్లో రూ.537.97 కోట్లు జమ చేశారు. 7,477 మంది రైతుల ఖాతాల్లో రూ.61.31 కోట్లు జమ కావాల్సి ఉంది.

Updated Date - 2021-06-24T07:02:18+05:30 IST