ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-06-10T07:33:23+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నిర్ణీత సమయంలోనే కొనుగోళ్లను పూర్తిచేశారు. ధాన్యాన్ని కూడా 98 శాతానికి పైగా తరలించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులను పూర్తిచేసుకున్నారు.

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ 

జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 62,4340 మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయించిన రైతులు

నిజామాబాద్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నిర్ణీత సమయంలోనే కొనుగోళ్లను పూర్తిచేశారు. ధాన్యాన్ని కూడా 98 శాతానికి పైగా తరలించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులను పూర్తిచేసుకున్నారు. రైతుల ఖాతాలో డబ్బులను జమచేస్తున్నారు.

జిల్లాలో 3లక్షల 85వేల ఎకరాల్లో పంటల సాగు..

జిల్లాలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లను ఆలస్యంగా చేపట్టినా నిర్ణీత సమయంలోనే కొనుగోళ్లను జరిగేవిధంగా చూశారు.  జిల్లాలో 3లక్షల85వేల ఎకరాల్లో పంటలను సాగుచేయగా ధాన్యం అత్యధికంగా దిగుబడి వచ్చింది. కొనుగోళ్లకు ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం వల్ల గన్నిబ్యాగులు, వాహనాలు, కూలీలను సమకూర్చడంలో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించారు. జిల్లాలో యాసంగిలో మొత్తం 457 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 6లక్షల 24వేల 340 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలోని వరి పండించే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,547 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. రాష్ట్రస్థాయిలోనే కొనుగోళ్లలో జిల్లా ముందుంది. జిల్లాలో మొత్తం 1223.70 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. వీటిలో ఇప్పటి వరకు 900 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో డబ్బులను జమచేశారు. మిగతా డబ్బులను మరో వారం రోజులలోపు వేసేవిధంగా ఏర్పాట్లను చేశారు. ధాన్యం కొనుగోలులో అకాల వర్షాలతో ఇబ్బందులు వచ్చినా వాటిని గ్రామాల వారీగా సరిచేసుకుంటూ రాష్ట్రస్థాయిలో ముం దుండే విధంగా అధికారులు ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల తరుగు తీయడంతో పాటు ఇతర ఆరోపణలు వచ్చి న వాటిని పరిష్కరిస్తూనే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మిల్లుల్లో కోతలు పెట్టిన త్వరగా దించుకునేవిధంగా చూడడంతో పాటు రైతులకు ట్రక్‌ షీట్‌ ఇవ్వడంతో పాటు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి చెల్లించేవిధంగా చూ శారు. జిల్లాలో ధాన్యం సేకరణ మొత్తం పూర్తిచేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులను ధాన్యం కొనుగోలుకు వినియోగించి పూర్తిచేశారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌లతో పాటు పౌరసరఫరాలశాఖ, సంస్థల అధికారులు వెంకటేశ్వర్‌రావు, అభిషేక్‌సింగ్‌, సహకారశాఖ అధికారి సింహాచలం కొనుగోలుపై దృష్టిపెట్టి పూర్తయ్యేవిధంగా చూశారు. నిర్ణీత సమయంలో కొనుగోలు పూర్తికావడంతో పాటు రాష్ట్రస్థాయిలో నెంబర్‌ వన్‌గా నిలవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2022-06-10T07:33:23+05:30 IST