చైనా నాసిరకం మాస్క్‌లు పంపింది: ఫిన్లాండ్‌

ABN , First Publish Date - 2020-04-10T13:33:26+05:30 IST

కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు చైనా నుంచి తెప్పించుకున్న మాస్క్‌లు సురక్షితంగా లేవని ఫిన్లాండ్‌ తెలిపింది.

చైనా నాసిరకం మాస్క్‌లు పంపింది: ఫిన్లాండ్‌

హెల్సింకి, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు చైనా నుంచి తెప్పించుకున్న మాస్క్‌లు సురక్షితంగా లేవని ఫిన్లాండ్‌ తెలిపింది. ఆ మాస్కులు నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని పేర్కొంది. చైనాలోని గ్వాంగ్‌జౌ నుంచి వచ్చిన 2 లక్షల సర్జికల్‌ మాస్కులు, 2.3 లక్షల రెస్పిరేటర్‌ మాస్కులను వాడే ముందు ఒకసారి పరీక్షించాలని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఐనో కైసా పెకోనెన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆ మరుసటి రోజే ఫిన్లాండ్‌ అధికారులు ఈ మాస్కులు రక్షణ ప్రమాణాలను అందుకోలేదని ప్రకటించారు. ఇది తమను నిరుత్సాహానికి గురిచేసిందని చెప్పారు.


ఐరోపాలో తగ్గుతున్న కేసులు!

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 9: కరోనా మహమ్మారి ఐరో పా దేశాల్లో తగ్గుముఖం పడుతోంది! ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్‌లో కొత్తగా కేసుల నమోదు తగ్గినట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు దేశాల్లో ఈ నెలారంభంలో కరోనా తీవ్ర ప్రభావం చూ పింది. ఫలితంగా ఉభయ దేశాల్లో 30వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. కానీ, ఈ వారంలో అం దుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొత్తగా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. 

Updated Date - 2020-04-10T13:33:26+05:30 IST