లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కేసు

ABN , First Publish Date - 2020-03-30T13:34:50+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని అతనిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ....

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కేసు

బిలాస్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్): కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడని అతనిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నగరంలో వెలుగుచూసింది.బిలాస్‌పూర్ నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పాండే తన స్వగృహంలో ప్రజలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుండటంతో ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. ఎమ్మెల్యే ఇంటివద్ద రేషన్ ను ఉచితంగా అందిస్తుండటంతో వెయ్యిమంది ప్రజలు గుమిగూడారని తమకు సమాచారం రావడంతో పోలీసులు అక్కడి వచ్చారు.


లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఎమ్మెల్యే శైలేష్ పాండేపై ఐపీసీ సెక్షన్ 188, 144, 279 ల ప్రకారం కేసు నమోదు చేశామని అదనపు ఎస్పీ ఓపీ శర్మ చెప్పారు. లాక్ డౌన్ సందర్భంగా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో 144 సెక్షన్ విధిస్తూ సీఎం భూపేష్ భాగేల్ ఆదేశాలు జారీ చేశారు.కాగా తన ఇంటివద్ద జనం పెద్దసంఖ్యలో తరలిరావడంతో తానే అదనపు ఎస్పీకి సమాచారం ఇచ్చానని, కరోనా వ్యాపిస్తున్న కష్టకాలంలో ప్రజలకు రేషన్ అందించి సహాయం చేయడం నేరమా అని ఎమ్మెల్యే శైలేష్ పాండే ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-03-30T13:34:50+05:30 IST