కశ్మీరీ ముస్లింలను కించపర్చేలా వ్యాఖ్యలు...BJP leader కేసు

ABN , First Publish Date - 2021-11-02T14:26:17+05:30 IST

కశ్మీరీ ముస్లింలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ విక్రమ్ రాంధావాపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు...

కశ్మీరీ ముస్లింలను కించపర్చేలా వ్యాఖ్యలు...BJP leader కేసు

శ్రీనగర్ : కశ్మీరీ ముస్లింలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ విక్రమ్ రాంధావాపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది ముజఫర్ అలీ షా లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేర బహు ఫోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.విక్రమ్ రాంధావా ముస్లింలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.



టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ జట్టు విజయం సాధించిన తర్వాత కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకలపై విక్రమ్ రంధవా ఈ వ్యాఖ్యలు చేశారు.ఐపీసీ సెక్షన్ 295 ఏ, 505ల కింద పోలీసులు బీజేపీ నేతపై కేసు పెట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విక్రమ్ రాంధావాకు బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. షోకాజ్ నోటీసులో సునీల్ సేథీ నేతృత్వంలోని బీజేపీ క్రమశిక్షణా కమిటీ రంధ్వాను 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.

Updated Date - 2021-11-02T14:26:17+05:30 IST