ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు.. సినీ రచయితపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2021-10-04T22:08:02+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై చేసిన వ్యాఖ్యలను గాను ప్రముఖ కవి, గేయరచయిత..

ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు.. సినీ రచయితపై ఎఫ్ఐఆర్

ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై చేసిన వ్యాఖ్యలను గాను ప్రముఖ కవి, గేయరచయిత జావేద్ అక్తర్‌పై ముంబై పోలీసులు సోమవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది సంతోష్ డుబే చేసిన ఫిర్యాదుతో ములంద్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐసీపీ సెక్షన్ 500 (పరువునష్టం కలిగించినందుకు శిక్ష)కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.


ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్‌పై తప్పుడు, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు గత నెలలో సంతోష్ డుబే లీగల్ నోటీసు పంపారు. ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కోరారు. అఖ్తర్ తన ఇంటర్వ్యూలో తాలిబన్లతో ఆర్ఎస్ఎస్‌ను పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. కాగా, దీనిపై క్షమాపణ చేయాలని అక్తర్‌కు గతంలో నోటీసు ఇచ్చానని, అందుకు ఆయన స్పందించ లేదని సంతోష్ డుబే చెప్పారు.  తన ఫిర్యాదుపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.

Updated Date - 2021-10-04T22:08:02+05:30 IST