Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 18 2021 @ 12:34PM

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

బెంగళూరు: బెంగళూరు నగర శివారులోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం షార్ట్‌సర్క్యూట్‌ చోటుచేసుకోగా రెండు ఫ్లాట్‌లలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అపార్ట్‌మెంట్‌ వాసులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్‌లోని సంపిగె నగర్‌ వసుంధరా లేఅవుట్‌ విమ్యాక్స్‌ చాలెట్‌ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్లాట్‌లో మంటలు చెలరేగడంతో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ చోటుచేసుకుంది. అనుబంధంగా ఉండే మరో ఫ్లాట్‌కు మంటలు విస్తరించాయి. పొగమంటలు రావడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు పరుగులు తీశారు. అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలు ఆర్పే పనులు కొనసాగించారు. మంటలు చెలరేగిన ప్లాట్‌లో ఫర్నీచర్‌ సహా వస్తువులు కాలిపోగా మరో ప్లాట్‌లోను వస్తువులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్లాట్‌ వాసులు హుటాహుటిన బయటకు వచ్చేయడంతో ప్రాణాపాయం తప్పినట్లు అయ్యింది. కాగా సెప్టెంబరు 21న నగరంలోని బన్నేరుఘట్ట అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా తల్లి-కుమార్తెలు సజీవదహనం అయిన విషయం మరువక ముండే అదే తరహాలో ప్రమాదం చోటుచేసుకోవడం నగర వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement