ఇర్వింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాధితులకు నాట్స్ సాయం..!

ABN , First Publish Date - 2020-03-03T13:18:44+05:30 IST

అమెరికాలోని ఇర్వింగ్‌లో సోమవారంరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై నాట్స్ స్పందించింది. భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అధికంగా

ఇర్వింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాధితులకు నాట్స్ సాయం..!

టెక్సాస్, మార్చి 2: అమెరికాలోని ఇర్వింగ్‌లో సోమవారంరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై నాట్స్ స్పందించింది. భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో నాట్స్ అత్యవసర సహాయ బృందం రంగంలోకి దిగి బాధితులకు సాయం అందించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే నాట్స్ నాయకులు బాపునూతి, రాజేంద్ర మాదల సహా పలువురు ఘటనాస్థలానికి చేరుకున్నారు.


తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రాంతంలోనే గదులు అద్దెకు తీసుకుని ఉంటారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణహానిగాని, ఎవరికీ గాయాలు కూడా కానప్పటికీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ముఖ్యమైన డాక్యుమెంట్‌లు కాలిపోయాయి. కాగా.. అగ్నిప్రమాదంలో తమ విలువైన వస్తులు కాలిపోయాయని తెలుగు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదంలో నష్టపోయిన వారికి నాట్స్ నాయకులు బాపునూతి, రాజేంద్ర మాదల ధైర్యం చెప్పారు. నాట్స్ తరఫున సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగువారికి ఏ ఆపద వచ్చిన ఆదుకోవడానికి నాట్స్ సిద్ధంగా ఉంటుందని.. నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదం సంభవించడానికిగల కారణాలపై స్థానిక అధికారులు దార్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-03T13:18:44+05:30 IST