సింగరేణి ఓసీలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-01-17T04:41:51+05:30 IST

సింగరేణి ఓసీలో అగ్నిప్రమాదం

సింగరేణి ఓసీలో అగ్నిప్రమాదం
షావెల్‌ నుంచి వస్తున్న మంటలు

దగ్ధమైన షావల్‌... రూ. 50 లక్షల నష్టం

కాకతీయఖని, జనవరి 16: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు-2లో  షార్ట్‌ సర్క్యూట్‌తో షావల్‌ దగ్ధమైంది. ఈ సంఘటన శనివారం రాత్రి జీ-11 యార్డు వద్ద బొగ్గు డిస్పాచ్‌ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా షావెల్‌  నుంచి మంటలు చేలరే గాయి. దీంతో అప్రమత్తమైన ఆపరేటర్‌ వాహనం నుంచి బయటకు దూకి ప్రాణాపాయం నుంచి తప్పించు కున్నాడు. అధికారులు వెంటనే వాటర్‌ ట్యాంకర్ల ద్వారా మంటలు ఆర్పే చర్యలు చేపట్టారు. అప్పటికే షావల్‌ కొంత భాగం కాలిపోయింది. దీంతో  సుమారు రూ.50 లక్షలు నష్టం వాటిల్లిందని కార్మికులు  చెబుతు న్నారు. ఇంజనీర్‌, మెకానికల్‌ సూపర్‌వైజర్ల పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని అంటున్నారు.  గతంలో కూడా ప్రమాదానికి గురై  షావెల్‌  దహనమైన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు అప్రమ త్తంగా లేరని స్పష్టం అవుతోందని కార్మికులు అంటున్నారు. ఈ ఘటనపై ఓసీ ప్రాజెక్టు అధికారి జాన్‌ ఆనంద్‌ను వివరణ కోరగా విచారణ చేపడతామని చెప్పారు.


Updated Date - 2021-01-17T04:41:51+05:30 IST