సినిమా హాలులో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-01-18T21:27:14+05:30 IST

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ షో సినిమా..

సినిమా హాలులో భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ షో సినిమా హాలు‌లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో జనం భీతావహులయ్యారు. ఐదు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిప్రమాదానికి కారణం కానీ, ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి నష్టం ఎంత జరిగి ఉండచ్చనే వివరాలు వెంటనే తెలియలేదు.

Updated Date - 2022-01-18T21:27:14+05:30 IST