Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 16 2021 @ 07:13AM

ముంబై పారిశ్రామిక వాడలో fire accident

10మందిని rescued పోలీసులు

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై పారిశ్రామికవాడలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ముంబై నగరంలోని కంజూర్ మార్గ్ ఈస్ట్ పారిశ్రామికవాడలోని శామ్‌సంగ్ సర్వీస్ సెంటరులో సోమవారం రాత్రి షార్టుసర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో మరో మూడు కంపెనీలకు సైతం మంటలు వ్యాపించాయి. శామ్‌సంగ్ సర్వీస్ సెంటరులో మంటలు రాజుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు కలిసి భవనంలో చిక్కుకున్న 10మందిని రక్షించారు.అగ్నిప్రమాదం జరిగిన వెంటనే 8 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. ఈ అగ్నిప్రమాద ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించింది. 


Advertisement
Advertisement