ఢిల్లీలో మరో కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-05-05T11:40:06+05:30 IST

దేశ రాజధాని నగరంలోని మరో కొవిడ్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది....

ఢిల్లీలో మరో కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

సురక్షితంగా రోగుల తరలింపు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని మరో కొవిడ్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ వికాస్ పురి ప్రాంతంలోని యూకే నర్సింగ్ హోంలో రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలో మంటలు చెలరేగడంతో 17 మంది కొవిడ్ రోగులు సహా 26 మందిని రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. 8 అగ్నిమాపక వాహనాలు వచ్చి ఆసుపత్రిలో మంటలను అదుపులోకి చేశాయి.స్టోరు రూంలో షార్టుసర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదంతో అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలు పగులగొట్టి రోగులను మంటల్లో నుంచి కాపాడారు.

Updated Date - 2021-05-05T11:40:06+05:30 IST