Abn logo
Feb 22 2020 @ 20:30PM

హాస్టల్‌లో మంటలు... ముగ్గురు యువతుల మృతి

ఛండీగఢ్: ఛండీగఢ్‌లోని ఓ పేయింగ్ గెస్ట్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువతులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శనివారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది.


సెక్టార్ 32లోని ఓ భవంతి మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో అందులో పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటున్న 19 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న ముగ్గురు మహిళలు మృతి చెందినట్టు ఛండీగఢ్ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ కుమార్ తెలిపారు. 20 మందికి పైగా విద్యార్థులు పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటున్నట్టు చెప్పారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నాలుగు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి కారణాలు వెంటనే తెలియలేదని, షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement