మాంబట్టు చెరువులో మంటలు

ABN , First Publish Date - 2021-06-22T03:30:45+05:30 IST

మండలంలోని మాంబట్టు పెద్ద చెరువులో మంటలు ఎగిసిపడ్డాయి. సోమవారం మధ్యాహ్నం చెరువులో ఎండిపోయిన మొక్కలు, గడ్డికి మంటలు అంటుకున్నాయి

మాంబట్టు చెరువులో మంటలు
మంటలను అదుపుచేస్తున్న ఫైర్‌ ఇంజన్లు

తడ, జూన్‌ 21 : మండలంలోని మాంబట్టు పెద్ద చెరువులో  మంటలు ఎగిసిపడ్డాయి. సోమవారం మధ్యాహ్నం చెరువులో ఎండిపోయిన మొక్కలు, గడ్డికి మంటలు అంటుకున్నాయి అవి చెరువుకు ఆనుకొని ఉన్న రీజన్‌ పవర్‌టెక్‌ పరిశ్రమ ప్రహరీ గేట్‌ వరకు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పరిశ్రమ ప్రతినిధులు అపాచీ పరిశ్రమకు, సూళ్లూరుపేట అగ్నిమాపక యంత్రానికి సమాచారం అందించారు. రెండు ఫైర్‌ ఇంజన్లు సంఘటనాస్థలానికి చేరుకొని రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశాయి. 

Updated Date - 2021-06-22T03:30:45+05:30 IST