నమశ్శివాయపురం కొండల్లో కార్చిచ్చు

ABN , First Publish Date - 2021-03-06T06:42:00+05:30 IST

మండలంలోని నమశ్శివాయపురం కొండల్లో గురువారం రాత్రి నుంచి మంటలు చెలరేగుతున్నాయి.

నమశ్శివాయపురం కొండల్లో కార్చిచ్చు
కొండ ప్రాంతంలో తగలబడుతున్న చెట్లు

కురిచేడు, మార్చి 7:  మండలంలోని నమశ్శివాయపురం కొండల్లో గురువారం రాత్రి నుంచి మంటలు చెలరేగుతున్నాయి. కొండల పక్కనే రైతుల పంట పొలాలు ఉన్నాయి. దీంతో మంటలు పొలాలకు పాకుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల క్రితం ఆవులమంద కొండల్లో కార్చిచ్చు ఏర్పడింది. ఇప్పటికే వెయ్యి ఎకరాల పైనే తగలబడింది. పడమరనాయుడుపాలెం వరకూ మంటలు పాకాయి. రైతుల పంట పొలాలూ కాలిపోయాయి. నమశ్శివాయపురంలోనూ అలాగే పంటలు అగ్నికి ఆహుతి అవుతాయని వారు భయపడుతున్నారు. అటవీ శాఖాధికారులు, రెవెన్యూ సిబ్బంది తగిన చర్యలు తీసుకుని అగ్నిమాపక సిబ్బందితో కలసి మంటలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.




Updated Date - 2021-03-06T06:42:00+05:30 IST