పోలింగ్ బూత్‌లో అగ్నిప్రమాదం.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-10-26T22:48:23+05:30 IST

మశాచూసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్‌ నగరంలో ఉన్న ఓ పోలింగ్ బూత్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో

పోలింగ్ బూత్‌లో అగ్నిప్రమాదం.. అమెరికాలో..

బోస్టన్: మశాచూసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్‌ నగరంలో ఉన్న ఓ పోలింగ్ బూత్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక బ్యాలెట్ బాక్స్‌కు నిప్పు అంటుకున్నట్టు అధికారులు తెలిపారు. బ్యాలెట్ బాక్సులో మొత్తం 122 బ్యాలెట్లు ఉండగా.. అందులో 35 బ్యాలెట్లు అగ్నికి ఆహుతి అయిపోయినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసిందని మశాచూసెట్స్ ఎన్నికల అధికారులు చెప్పడంతో ఎఫ్‌బీఐ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. మరోపక్క అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో బ్యాలెట్ బాక్స్ దగ్గర ఉన్న ఓ వ్యక్తి ఫొటోలను స్థానిక పోలీసులు విడుదల చేశారు. 35 బ్యాలెట్లు కాలిపోవడంతో ఓటర్లు వ్యక్తిగతంగా వచ్చి మళ్లీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. 


కాగా.. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. నవంబర్ మూడో తేదీన ఓటు హక్కు వినియోగించుకోలేని వారి కోసం ఎర్లీ ఓటింగ్‌‌ను కూడా ఇప్పటికే ప్రారంభించారు. మశాచూసెట్స్‌లో గత శనివారం నుంచి ఎర్లీ ఓటింగ్ మొదలవగా.. ఇప్పటివరకు 20 లక్షలకు పైగా ఓటర్లు తన ఓటు హక్కును వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా వినియోగించుకున్నారు. 

Updated Date - 2020-10-26T22:48:23+05:30 IST