పండుగల కన్నా శుభకార్యాల్లోనే ఆ పని చేసేవారు.. వెదురు బొంగులో మందుకూరి వెలిగించేవారు.. ఎవరికీ తెలియని టపాసుల చరిత్ర!

ABN , First Publish Date - 2021-11-01T15:24:18+05:30 IST

దీపావళి వేళ ఆనందంగా టపాసులు కాలుస్తుంటారు. అయితే..

పండుగల కన్నా శుభకార్యాల్లోనే ఆ పని చేసేవారు.. వెదురు బొంగులో మందుకూరి వెలిగించేవారు.. ఎవరికీ తెలియని టపాసుల చరిత్ర!

దీపావళి వేళ ఆనందంగా టపాసులు కాలుస్తుంటారు. అయితే వీటిని ముందుగా ఎక్కడ కాల్చారో తెలుసా? ఇంతకీ దీపావళికి.. టపాకులకు ఉన్న కనెక్షన్ ఏమిటో తెలుసా? సుమారు 2200 ఏళ్ల క్రితం చైనాలోని లుయియాంగ్‌లో టపాసులు కాల్చారని చరిత్ర చెబుతోంది. అప్పట్లో పటాకులను వెదురు బొంగులతో చేసేవారు. వాటిని వెలిగించగానే అవి వెలుగులనిస్తూ, పెద్ద శబ్ధం చేస్తూ పేలిపోయేవి. టపాకుల నుంచి వచ్చే శబ్ధం వలన చెడు ఆత్మలు దూరంగా పారిపోతాయని చైనీయులు నమ్ముతుంటారు. పండుగలు, ముఖ్యమైన రోజుల్లో చైనీయులు టపాసులు వెలిగిస్తుంటారు. వీటిని కాల్చడం వలన తమ దారిద్ర్యం తొలగిపోతుందని వారు భావిస్తారు. 13 నుంచి 15వ శతాబ్దం మధ్య కాలంలో టపాకుల సంస్కృతి చైనా నుంచి యూరప్ దేశాలకు పాకింది. తరువాత ఇది అమెరికాకు చేరింది. అక్కడ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బాణాసంచా కాల్చారు.


భారతదేశంలో 8వ శతాబ్దంలో లిఖించిన వైశంపాయన నీతి ప్రకాశికలో టపాసుల తయారీ విధానం గురించి ఉంది. పీకే గౌడ్ రచించిన ది హిస్టరీ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఇన్ ఇండియా బిట్వీన్ ఏడీ 1400 అండ్ 1900 పుస్తకంలో 1518లో గుజరాత్‌లోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలో తొలిసారిగా టపాసులు కాల్చారని పేర్కొన్నారు. ఆ తరువాత నుంచి పండుగలు, శుభకార్యాలు, ముఖ్యమైన రోజుల్లో బాణాసంచా కాల్చడం మొదలయ్యిందని తెలుస్తోంది. 18వ శతాబ్ధం నాటికే భారతదేశంలో దీపావళి వేళ టపాసులు కాల్చడం ఆచారంగా మారిపోయింది. పలు గ్రంథాలలో దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. 

Updated Date - 2021-11-01T15:24:18+05:30 IST