Abn logo
Jul 11 2020 @ 18:40PM

మెదక్‌ : కాలిన స్థితిలో యువకుడి శవం లభ్యం

మెదక్ : జిల్లాలోని రేగోడ్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో యువకుడి శవం లభ్యమైంది. సుమారు 30 సంవత్సరాలు వయసుండే యువకుడి శవం కాలిన స్థితిలో కనిపించింది. అయితే.. ఆ మృతదేహంపై స్థానికులకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. స్థానిక సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వేరే ప్రదేశంలో చంపి ఇక్కడ కల్వర్టు కింద పడేసి, ఆనవాళ్లు దొరకాకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగుంటుంది..? ఆ యువకుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి..? అని ఆనవాళ్ల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు స్థానికంగా ఉన్న టోల్ గేట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

బీ కేర్ఫుల్మరిన్ని...

Advertisement
Advertisement