చైనాలో ‘కొవిడ్’ రోగి కలకలం! రోగలక్షణాలు లేవు కానీ..

ABN , First Publish Date - 2020-02-22T20:13:16+05:30 IST

అయితే చైనాలోని కరోనా బారిన పడ్డ ఓ యువతి మాత్రం డాక్టర్లకు కలవరం కలిగిస్తోంది.

చైనాలో ‘కొవిడ్’ రోగి కలకలం! రోగలక్షణాలు లేవు కానీ..

బీజింగ్: కరోనా వైరస్ సోకిన బాధితుడిలో  రోగలక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. దీంతో జ్వరం.. ఫ్లూ వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రులను సంప్రదించమని డాక్టర్లు చెబుతున్నారు. అంటే.. వ్యాధి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు ఇది ఎంతో సహకరిస్తోంది. అయితే చైనాలో కరోనా బారిన పడ్డ ఓ యువతి మాత్రం డాక్టర్లకు కలవరం కలిగిస్తోంది. ఆమె శరీరంలో వైరస్ ప్రవేశించినప్పటికీ ఎటువంటి రోగ లక్షణాలు కలిగించకపోవడంతో.. కోవిడ్-19(కరోనా) గుట్టుచప్పుడు కాకుండా ఆమె కుటుంబంలోని మరో ఐదుగురికి వ్యాపించింది. యువతికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానం కుటుంబసభ్యులెవరికీ కలుగకపోవడంతో వారు కూడా దీని బారిన పడ్డారు. ఇటువంటి కేసు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కావడం అక్కడి ప్రభుత్వాన్ని కలవర పాటుకు గురిచేస్తోంది. కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేయటంలో ఇటువంటి కేసులు కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశం ఉందని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇటీవల ప్రచురితమయ్యాయి. 


Updated Date - 2020-02-22T20:13:16+05:30 IST