త్వరలో 100 శాతం వ్యాక్సినేషన్: మాండవీయ

ABN , First Publish Date - 2021-12-11T01:10:16+05:30 IST

దేశంలోని 86 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని..

త్వరలో 100 శాతం వ్యాక్సినేషన్: మాండవీయ

న్యూఢిల్లీ: దేశంలోని 86 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని, సాధ్యమైనంత త్వరలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ శుక్రవారంనాడు తెలిపారు. అర్హులైన 47.91 కోట్ల మంది (51 శాతం) వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని చెప్పారు. లోక్‌సభలో అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, అమెరికా, జర్మనీ ఫ్రాన్స్ ఇతర దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డాటాను పంచుకున్నారు. భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చక్కగా సాగుతోందని అన్నారు. ఏడు కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఎవరూ వెనుకాడవద్దని కోరారు.


ఒమైక్రాన్‌పై...

ఒమెక్రాన్ వేరియంట్‌పై మంత్రి మాట్లాడుతూ, దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని, అవి పూర్తయిన తర్వాతే ఏ వ్యాక్సిన్ అయితే ఒమైక్రాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలదనే విషయం తెలుస్తుందన్నారు. ప్రస్తుతం దేశంలో 23 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూశాయని, ప్రపంచవ్యాప్తంగా 59 దేశాల్లో ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. జెనోమ్ సీక్వెన్సింగ్‌కు సంబంధించి ప్రస్తుతం దేశంలో 36 ల్యాబొరేటరీలు ఉన్నాయని తెలిపారు.

Updated Date - 2021-12-11T01:10:16+05:30 IST