ప్రశాంతంగా జేఈఈ మెయిన్‌

ABN , First Publish Date - 2021-02-24T05:06:47+05:30 IST

జేఈఈ మెయిన్స్‌ బీఆర్క్‌ మొదటి విడత పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షకు 924మంది అభ్యర్థులకు గాను 851 మంది హాజరయ్యారు.

ప్రశాంతంగా జేఈఈ మెయిన్‌
పరీక్ష కేంద్రంలోకి వెళుతున్న విద్యార్థులు

తొలిరోజు బీఆర్క్‌ పరీక్షకు 851మంది హాజరు

ఖమ్మం ఖానాపురంహవేలి/ కొణిజర్ల, ఫిబ్రవరి 23 : జేఈఈ మెయిన్స్‌ బీఆర్క్‌ మొదటి విడత పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షకు 924మంది అభ్యర్థులకు గాను 851 మంది హాజరయ్యారు. ఖమ్మం కో ఆర్డినేటర్‌ పరిధిలోని డేర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రంలో 180మందికి 164మంది, తనికెళ్ల విజయ ఇంజనీరింగ్‌ కాలేజీలో 230మందికి 213మంది, ఎస్‌బీఐటీలో 230మందికి 217మంది, బొమ్మ కళాశాలలో 90మందికి 79మంది, సూర్యాపేటలోని శ్రీవెంకటేశ్వర కళాశాలలో 194మందికి 178మంది హాజరయ్యారు. పరీక్షల మొదటిరోజు మధ్యాహ్నం 3గంటలనుంచి సాయంత్రం 6గంటలవరకు నిర్వహించారు. అయితే కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిం చిన తర్వాతే అభ్యర్థులను లోనికి అనుమతించారు. లోపల భౌతికదూరం పాటిస్తూ విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కాగా . బుధవారం నుంచి నుంచి వరుసగా నాలుగు రోజులు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 3గంటల నుంచి 6గంటల వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి.  ఈ పరీక్షలను సిటీ కోఆర్డినేటర్‌ ఆర్‌.పార్వతీరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 


Updated Date - 2021-02-24T05:06:47+05:30 IST