ఈ ఏడాది Americaలో ఇదే తొలి మరణదండన

ABN , First Publish Date - 2022-01-29T00:29:05+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది తొలి మరణదండన అమలైంది. ఓక్లహోమా రాష్ట్రానికి చెందిన డొనాల్డ్ గ్రాంట్ అనే వ్యక్తికి అమెరికా అధికారులు మరణ శిక్ష అమలు చేశారు. ఇందుకు సంబంధించిన పూ

ఈ ఏడాది Americaలో ఇదే తొలి మరణదండన

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది తొలి మరణదండన అమలైంది. ఓక్లహోమా రాష్ట్రానికి చెందిన డొనాల్డ్ గ్రాంట్ అనే వ్యక్తికి అమెరికా అధికారులు మరణ శిక్ష అమలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


2001లో డొనాల్డ్ గ్రాంట్‌కు 25ఏళ్లు. జైలులో ఉన్న గాళ్‌ఫ్రెండ్‌కు బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బును ఎలాగైనా కూడబెట్టాలని అప్పట్లో డొనాల్డ్ గ్రాంట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. స్థానికంగా ఉన్న హోటల్‌లోకి చొరబడి డబ్బులను దొంగిలించబోయాడు. ఈ క్రమంలో ఆ హోటల్ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు డొనాల్డ్ గ్రాంట్.. వారిపై కాల్పులు జరిపాడు.



ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు. తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. డొనాల్డ్ గ్రాంట్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు డొనాల్డ్ గ్రాంట్‌కు మరణశిక్ష విధిస్తూ 2005లో తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లిన డొనాల్డ్ గ్రాంట్.. మరణశిక్షకు వ్యతిరేకంగా 17ఏళ్లపాటు పోరాటం చేశాడు. అయితే అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో గురువారం ఓక్లాహోమా అధికారులు.. డొనాల్డ్ గ్రాంట్‌కు లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. 


ఇదిలా ఉంటే.. అమెరికాలోని 23 రాష్ట్రాలు మరణశిక్ష రద్దు చేయగా.. కాలిఫోర్నియా, ఒరెగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాలు మాత్రం మరణదండనపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఓక్లాహోమా కూడా 2015లో మరణ శిక్షలపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే 2021లో నిషేధాన్ని ఎత్తేసింది. 




Updated Date - 2022-01-29T00:29:05+05:30 IST