ఏడు ప్రత్యేక విమానాల్లో.. భారత్ నుంచి లండన్ చేరనున్న యూకే వాసులు

ABN , First Publish Date - 2020-04-10T02:37:44+05:30 IST

భారత్‌లో చిక్కుకున్న యూకే వాసుల కోసం అక్కడి ప్రభుత్వం ఏడు ప్రత్యేక

ఏడు ప్రత్యేక విమానాల్లో.. భారత్ నుంచి లండన్ చేరనున్న యూకే వాసులు

లండన్: భారత్‌లో చిక్కుకున్న యూకే వాసుల కోసం అక్కడి ప్రభుత్వం ఏడు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. వీటిలో మొదటి విమానం బుధవారం రాత్రి గోవాలోని డాబొలిన్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరింది. ఈ విమానంలో 316 మంది యూకే వాసులు తమ స్వదేశానికి చేరుకున్నారు. మరో రెండు విమానాలు ఏప్రిల్ 10,12వ తేదీల్లో గోవా నుంచి బయల్దేరనున్నాయి. ఇక మిగతా నాలుగు విమానాలు ముంబాయి, ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లనున్నాయి. భారతదేశంలో 35 వేలకు పైగా బ్రిటిష్ వాసులు చిక్కుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వివిధ దేశాల్లో చిక్కుకున్న తమ దేశస్థులను తిరిగి యూకేకు తెచ్చేందుకు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నామని యూకే విదేశాంగశాఖ తెలిపింది. మరోపక్క యూకేతో పోల్చుకుంటే భారత్‌లో కరోనా కేసులు చాలా తక్కువగానే నమోదయ్యాయి. దీంతో దాదాపు 15 వేల మంది యూకే వాసులు మరి కొంత కాలం భారత్‌లో ఉండేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా అమెరికా, యూరప్ దేశాలపైనే కనపడుతోంది. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-10T02:37:44+05:30 IST