Abn logo
May 19 2020 @ 13:52PM

ఇండియన్ స్క్రీన్‌పై తొలి లిప్ లాక్ ఏదో తెలుసా?

Kaakateeya

క‌రోనా ప్ర‌భావంతో రొమాంటిక్ సీన్స్ ఇక‌పై సినిమాల్లో క‌న‌ప‌డ‌వ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. క‌రోనా ప్ర‌భావం లేక ముందు తెలుగు సినిమాల్లో లిప్ లాక్స్ సాధార‌ణంగా మారిపోయాయి. కానీ ఒక‌ప్పుడు తెలుగులో లిప్‌లాక్స్ అనేవి చిన్న విష‌యం కాదు. కానీ ఇండియ‌న్ సినిమాలో తొలి లిప్‌లాక్ ఏ సినిమాలో చిత్రీక‌రించారు? అనే విష‌యాన్ని చూస్తే 1933లో క‌ర్మ అనే బాలీవుడ్ చిత్రంలో తొలి లిప్‌లాక్ సీన్‌ను చిత్రీక‌రించార‌ట‌. హీరోయిన్ దేవికారాణి త‌న భ‌ర్త‌తో ఈ సీన్‌లో న‌టించింది. అప్ప‌ట్లో ఈ లిప్‌లాక్ సెన్సేష‌న‌ల్‌గా మారింది. దేవికారాణిపై ప‌లువురు విమ‌ర్శ‌లు కూడా చేశారు. కానీ క్ర‌మంగా సినిమాల్లో లిప్‌లాక్ అనేది సాధార‌ణ విష‌యంగా మారిపోయింది. 

Advertisement
Advertisement