Oct 22 2021 @ 19:15PM

manchu Vishnu: ‘మా’లో మహిళలకు పెద్దపీట

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు తన మేనిఫెస్టోలో ఒక్కో అంశాన్ని అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు. ‘మా’లో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్‌ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ‘మహిళల ప్రాధాన్యత దృష్ట్యా ‘విమెన్‌ ఎంపర్‌మెంట్‌ అండ్‌ గ్రివెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. మహిళా సాధికారిత కోసం ఈ కమిటీ ఏర్పాటు చేశాం. పద్మశ్రీ సునీత కృష్ణన్‌ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో  నలుగురు మహిళలు ఇద్దరు పురుషులు ఉంటారు. వారి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అన్నారు.