Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త తరం కొడుకులు’కు ప్రథమ బహుమతి


  నర్సీపట్నంలో ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు

నర్సీపట్నం, నవంబరు 28 : పట్టణంలో డీసీసీబీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, సన్యాసిపాత్రుడు ఆధ్వర్యంలో సిటీ క్లబ్‌ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రుత్తల లచ్చా పాత్రుడు, చింతకాయల వరహాలదొర నాటక పరిషత్‌ రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం రాత్రి  ముగి శాయి. ‘కొత్త తరం కొడుకులు నాటిక’ ప్రథమ బహుమతికి ఎంపికైంది. ముగిం పోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజ రైన జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌, రాష్ట్ర క్రియేటివ్‌ కల్చరల్‌ యాక్టివీటి కమిషన్‌ చైర్‌పర్సన్‌ వంగపండు ఉష మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహిం చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇందుకు తమ వంతు కృషి చేస్తు న్నట్టు చెప్పారు. అనంతరం డీసీసీ చైర్‌పర్సన్‌ అనిత, యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకులు సత్యానందం, నటులు జోగినాయుడు, దస్త్రాల రాఘవేంద్రరావులు మాట్లాడుతూ పాత్రలకు ప్రాణం పోసిన కళాకారులను అభినందించారు.  అంతకు ముందు ప్రదర్శిం చిన సంపద నాటిక విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ను ఘనంగా సత్కరించారు. 

ఉత్తమ నాటికగా మొదటి స్థానంలో ‘కొత్త తరం కొడుకులు’, ద్వితీయ స్థానం ‘అంతా మన మంచికే’, తృతీయ స్థానంలో ‘నిర్జీవ నినాదం’ నిలిచాయి. ఉత్తమ అభినయానికి గుడివాడ లహరి, సురభి ప్రభావతి, జ్యోతి, సంధ్యా ప్రియదర్శిని, నాగాభట్ల రఘు, శివప్రసాద్‌ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడుగా చెలికాని వెంకటరావు (కొత్త తరం కొడుకులు), ఉత్తమ సంగీతం దర్శకుడుగా లీలా మోహన్‌ (నిర్జీవీ నినాదం), కన్సొలేషన్‌ బహుమతులు డి.నాగరాణి (అంతా మన మంచికే), శివరామిరెడ్డి ( చీకటిపువ్వు) సాధించారు. స్వామి, పాములయ్య, రాజా తాతయ్యలు నాటిక పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు నగదు పురస్కారంతో పాటు, శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు.

Advertisement
Advertisement