Abn logo
May 23 2020 @ 19:48PM

‘నో పెళ్లి’ అంటున్న సాయి తేజ్

‘నో పెళ్లి’ అంటున్నాడంటే సుప్రీమ్ హీరో సాయితేజ్ ఇక పెళ్లి చేసుకోడని అనుకుంటున్నామో! అంతలేదు కానీ.. ఆయన హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’. ఈ చిత్రంతో సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప‌క్కా ప్లానింగ్‌తో పూర్తి చేసి మే 1, 2020లో విడుదల చేస్తామని నిర్మాత‌లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితులన్నీ మారిపోవడంతో కామ్‌గా ఉన్న చిత్రయూనిట్ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేది చెప్పలేదు కానీ, చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం స్టార్ట్ చేయబోతున్నారు.


ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘నో పెళ్లి’ అనే సింగిల్‌ను మే 25 (సోమవారం), ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌. థమ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెంక‌ట్ సి. దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement