Abn logo
Jul 21 2021 @ 11:58AM

ఎన్నికల్లో పోటీచేసిన తొలి ట్రాన్స్‌జండర్ అనన్య మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం!

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ట్రాన్స్ జండర్ అభ్యర్థి, రాష్ట్రంలో తొలి ట్రాన్స్ రేడియో జాకీగా పేరొందిన అనన్యా కుమారి తన ఇంటిలో విగతజీవిగా కనిపించారు. కొచ్చిలోని స్వగృహంలో ఆమె మృతదేహం లభ్యమయ్యింది. కాగా గతంలో అనన్య తాను సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ చేయించుకున్న తరువాత పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

 2020లో అనన్య కొచ్చిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వెజినోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపధ్యంలో ఏడాది తరువాత కూడా ఆమె అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. కాగా అనుమానా స్పద స్థితిలో లభ్యమైన అనన్య మృతదేహాన్ని అధికారులు ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా అనన్య తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చే్స్తున్నారు.

క్రైమ్ మరిన్ని...