Abn logo
Sep 21 2021 @ 19:15PM

రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటిముందు మొదటి భార్య నిరసన

చిత్తూరు: గంగాధర నెల్లూరు మండలం వింజం గ్రామంలో రెండో పెళ్లి చేసుకున్న భర్త హరీష్‌ను అరెస్ట్ చేయాలని భార్య లావణ్య కూతురుతో కలసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. లావణ్య చేపట్టిన నిరసనకు దళిత సంఘాలు మద్దతు తెలిపాయి. లావణ్యను మోసం చేసి కోర్టులో కేసు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న హరీష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. తల్లి బిడ్డకు న్యాయం చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. విషయం తెలుసుకుని పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. భార్య లావణ్యకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీసులు నిరసన విరమింపజేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption