చేపల వేటకు వేళాయె!

ABN , First Publish Date - 2020-06-01T08:50:36+05:30 IST

చేపల వేట పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైంది. వాస్తవానికి.. ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేట నిషేధం.

చేపల వేటకు వేళాయె!

వన్‌టౌన్‌(విశాఖ సిటీ), మే 31: చేపల వేట పునఃప్రారంభానికి సమయం ఆసన్నమైంది. వాస్తవానికి.. ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 15 వరకు చేపల వేట నిషేధం. కానీ కరోనా వైరస్‌, లాక్‌ డౌన్‌ కారణంగా ప్రభుత్వం మార్చి నాలుగో వారం నుంచే చేపల వేటను నిషేధించింది. దీంతో మూడు వారాల ముందే మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. ఈ లోటు భర్తీకి పక్షం రోజుల ముందుగానే... అంటే జూన్‌ ఒకటో తేదీ నుంచే చేపల వేటకు వెళ్లవచ్చని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.


అయితే, ఏటా గంగమ్మ తల్లి జాతర, భారీ ఎత్తున పూజలు చేసిన తరువాతే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని మరబోటు సంఘం నేతలు, మత్స్యకార పెద్దలు నిర్ణయించారు. పూజల అనంతరం అదే రోజు రాత్రి సముద్రంలో చేపల వేటకు బయలుదేరతారు. అయితే వివిధ కారణాల వల్ల చాలా మంది ఆపరేటర్లు బోట్లను సిద్ధం చేయలేదు.

Updated Date - 2020-06-01T08:50:36+05:30 IST