Abn logo

ఫిష్‌ కర్రీ

కావలసినవి: చేపలు - అరకేజీ, చింతపండు రసం - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, కరివేపాకు - కొద్దిగా. 


తయారీ: చేప ముక్కలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత ఆ పాత్రలో చింతపండు రసం పోసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు వేయాలి. కొబ్బరి తురుము, పసుపు వేసి కలపాలి. పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా నీళ్లు పోయాలి. ఇప్పుడు ఆ పాత్రను స్టవ్‌పై పెట్టి ఉడికించాలి. మిశ్రమం వేడెక్కిన తరువాత పసుపు, కారం, తగినంత ఉప్పు వేయాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలియబెట్టి ఉడికించాలి. చేప ముక్కలు ఉడికిన తరువాత దింపి వేడివేడిగా వడ్డించాలి.

నర్గీసి కబాబ్‌ కా కుర్మాకోఫ్తా ఔర్‌ దహీ కి కాడీకాలియా ఖాసా దో - ప్యాజ్‌క్విక్‌ చికెన్‌! హనీ గార్లిక్‌ చికెన్‌! మరాక్‌చాట్‌పటి మచ్చీహైదరాబాద్‌ దమ్‌ కా ముర్గ్‌ప్రాన్స్‌ టిక్కా మసాలాబొమ్మిడాయిలు పాలకూర
Advertisement