Abn logo

ఫింగర్స్‌

కావలసినవి: చేపలు - పావుకిలో, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, మైదా పిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, శనగపిండి - అర టేబుల్‌స్పూన్‌, కోడిగుడ్లు - రెండు, బ్రెడ్‌ ముక్కలు - అరకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ఆవాలు, ఒక టీస్పూన్‌, మెంతులు - అరటీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా.


తయారీ: జీలకర్ర, ఆవాలు, మెంతులను మిక్సీలో వేసి పొడి చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో మైదా, శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత కోడిగుడ్ల తెల్లసొన వేసి కలియబెట్టాలి. చేపలను నిలువుగా ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. చేప ముక్కలను పిండి మిశ్రమంలో వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి మారినేట్‌ చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక మారినేట్‌ చేసిన చేప ముక్కలకు బ్రెడ్‌ క్రంబ్స్‌ అద్ది వేగించాలి. వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


టిక్కామంచూరియాఫిష్‌ కేక్‌కట్‌లెట్స్‌చిన్న చేపల వేపుడుభార్వా ముర్గ్‌ లెగ్‌చక్నాగురక్‌ కబాబ్‌ముర్గ్‌ మలాయి కబాబ్‌ఫ్రైడ్‌ చికెన్‌
Advertisement