హోం మంత్రి ఇలాకాలో చేపల చెరువు వేలం వివాదం

ABN , First Publish Date - 2020-07-13T20:10:14+05:30 IST

ఏపీ హోం మంత్రి సుచరిత నియోజకవర్గంలో చేపల చెరువు వేలం..

హోం మంత్రి ఇలాకాలో చేపల చెరువు వేలం వివాదం

గుంటూరు జిల్లా: ఏపీ హోం మంత్రి సుచరిత నియోజకవర్గంలో చేపల చెరువు వేలం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఒకసారి జరిగిన వేలం పాటను అధికారపార్టీ నేతల ఒత్తిడితో రెండోసారి నిర్వహించారు. తమ పాటను ఎందుకు రద్దు చేస్తున్నారో సమాధానం చెప్పాలని మొదటి పాటదారులు దేవాదాయశాఖ సిబ్బందిని నిలదీశారు. దీంతో మొదటి పాట వేలం దారులైన సుబ్రహ్మణ్యం దంపతులపై అధికారపార్టీ వర్గం దాడికి యత్నించింది. తమకు న్యాయం చేయాలని వేలం పాట అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 


హోంమంత్రి సుచరిత నియోజనకవర్గం, వట్టిచెరుకూరు మండలం, కోవెలమూడిలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఆదిపత్యపోరుగా మారడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నెల 3న అధికారులు వేలం పాట నిర్వహించగ.. సుబ్రహ్మణ్యం దంపతులు వేలం పాట దక్కించుకున్నారు. అయితే కొంతమంది అధికారపార్టీ నేతల ఒత్తిడితో సోమవారం మళ్లీ వేలం పాట నిర్వహించడంతో వివాదం చెలరేగింది. 

Updated Date - 2020-07-13T20:10:14+05:30 IST