కర్ఫ్యూతో మత్స్యకారులు విలవిల

ABN , First Publish Date - 2021-05-17T05:53:38+05:30 IST

కర్ఫ్యూ కారణంగా మండలంలోని అలగనూరు రిజర్వాయర్‌లో చేపలు పడుతున్న మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు.

కర్ఫ్యూతో  మత్స్యకారులు విలవిల

  1. కరోనాతోఎగుమతులు లేక నిలిచిన చేపల వేట


మిడుతూరు, మే 16: కర్ఫ్యూ కారణంగా మండలంలోని అలగనూరు రిజర్వాయర్‌లో చేపలు పడుతున్న మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. చేపల వేటను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారంతా గత 40 రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కర్ఫ్యూ కారణంగా రవాణా సౌకర్యాలన్నీ నిలిచి చేపల ఎగుమతులకు బ్రేక్‌ పడింది. దీంతో చేపలవేటతోపాటు మార్కెట్‌ పతనమైనది. తద్వారా మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి పూటగడవని పరిస్థితిలో అవస్థలు పడుతున్నారు. అలగనూరు రిజర్వాయర్‌లో రోళ్లపాడు, అలగనూరు, తలముడిపి, కొర్రప్రోలూరు, గడివేముల గ్రామాలకు చెందిన 150 మంది మత్స్యకారులు ఉన్నారు.  చేపల వేటను నిలిపిన కారణంగా మత్స్యకారులు బుట్టలను, వలలను రిజర్వాయర్‌ ఒడ్డున నిరుపయోగంగా ఉంచారు.


 చేపల వేటను నిలిపివేశాం 

కర్ఫ్యూ కారణంగా చేపల ఎగుమతులు లేక చేపల వేటను నిలిపివేశాం. దీంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాం. మత్స్యకారులను ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలి.

 -  సంజీవుడు, మత్స్యకారుడు, రోళ్లపాడు


Updated Date - 2021-05-17T05:53:38+05:30 IST