అరుదైన నీలపు ఎండ్రకాయ.. జాలరి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-04-25T02:01:06+05:30 IST

ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో చేపలు పడుతున్న ఓ జాలరికి అరుదైన నీలి రంగు ఎండ్రకాయ దొరికింది. పడవలో చేపలు పడుతుండగా..

అరుదైన నీలపు ఎండ్రకాయ.. జాలరి ఏం చేశాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో చేపలు పడుతున్న ఓ జాలరికి అరుదైన నీలి రంగు ఎండ్రకాయ దొరికింది. పడవలో చేపలు పడుతుండగా ఈ ఎండ్రకాయ అతడి వలలో చిక్కింది. అయితే దీనిని పట్టుకున్న అతడు దీని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ ఎండ్రకాయ చాలా చిన్నదని, అందువల్ల దానిని బయటకు తీసుకురాకుండా సముద్రంలోనే వదిలేస్తున్నట్లు చెప్పాడు. దీనిపై నేషనల్ లాబ్‌స్టర్ హ్యాట్చరీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇలాంటి ఎండ్రకాయలు లక్షలో ఒకటి ఉంటాయని, అయితే ఇవి నీలం రంగులో ఉండడం వల్ల వీటిని వేటాడే జంతువులకు సులభంగా దొరికిపోతాయని చెప్పారు. వీటి శరీరపు రంగును ఉత్పత్తి చేసే కణాల్లో ఉండే మార్పుల వల్లే ఇవి ఇలా నీలం రంగులో మారతాయని తెలిపారు.

Updated Date - 2021-04-25T02:01:06+05:30 IST