స్వగ్రామాలకు మత్స్యకారులు

ABN , First Publish Date - 2020-05-16T10:54:21+05:30 IST

మండల పరిధిలోని కొడమలూరు సోమశిల వెనుక జలాల్లో శ్రీకాకుళం, తూర్పుగోదావరి,

స్వగ్రామాలకు మత్స్యకారులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ ‌ఒంటిమిట్ట, మే 15: మండల పరిధిలోని కొడమలూరు సోమశిల వెనుక జలాల్లో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 131మంది మత్స్యకారులు వారి స్వగ్రామాలకు తరలివెళ్లారు. శుక్రవారం సీఐ హనుమంతునాయక్‌, అమర్‌నాధరెడ్డి మత్స్యకారులు వెళుతున్న బస్సును జెండా ఊపి ప్రారంభించారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేక.. ఉన్నచోట ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న మత్య్సకారుల కష్టాలను ‘కడుపులో ఆకలి. కళ్లల్లో ఊరు’ పేరిట ఆంధ్రజ్యోతి గత మంగళవారం వెలుగులోకి తెచ్చింది.


దీంతో స్పందించిన అధికారులు మత్స్యకారులు స్వగ్రామాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుంటే వెళ్లే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ మేరకు మత్స్యకారులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు తహసీల్దారు విజయకుమారికి దరఖాస్తు చేసుకోవడంతో 143 మందికి పాసులు మంజూరు చేశారు. వీరంతా శుక్రవారం మూడు బస్సుల్లో వారి స్వగ్రామాలకు బయల్దేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల ప్రతినిధులు రమణ, నరసింహారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-05-16T10:54:21+05:30 IST