హెటెరో పైప్‌లైన్‌ ఆపాలని మత్స్యకారుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-02T06:32:04+05:30 IST

రాజయ్యపేట సముద్రంలోకి హెటెరో ఔషధ పరిశ్రమ వ్యర్థాల తర లిం పునకు నిర్మిస్తున్న పైపులైన్‌ పనులను తక్షణమే నిలిపి వేయాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు.

హెటెరో పైప్‌లైన్‌ ఆపాలని మత్స్యకారుల ఆందోళన
రాజయ్యపేట తీరంలో నినాదాలు చేస్తున్న మత్స్యకారులు

నక్కపల్లి, డిసెంబరు 1 : రాజయ్యపేట సముద్రంలోకి హెటెరో ఔషధ పరిశ్రమ వ్యర్థాల తర లిం పునకు నిర్మిస్తున్న పైపులైన్‌ పనులను తక్షణమే నిలిపి వేయాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం రాజయ్యపేట తీరం వద్ద ఆందోళన చేపట్టారు. ఇప్పటికే రసాయన పరిశ్రమలు సముద్రంలోకి వ్యర్థజలాలను విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద నాశనమవుతోందని వాపో యారు. వీరి ఆందోళనకు జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, జేఏసీ ప్రతినిధులు కంబాల అమ్మోరయ్య, పిక్కి స్వామి, మేరుగు కొర్లయ్య సంఘీభావం తెలిపారు. మత్స్యకార జేఏసీ నక్కపల్లి మండల అధ్యక్షుడు పిక్కి నూకరత్నం, సీహెచ్‌.రమణ, రామకృష్ణ, పి.కోటి, గిరీష్‌, వరహాలబాబు, జగ్గ, జగన్‌, జగదీష్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T06:32:04+05:30 IST