ఫిట్‌ బిట్‌ చార్జ్‌ 5

ABN , First Publish Date - 2021-08-28T05:55:28+05:30 IST

గూగుల్‌కు చెందిన వేరబుల్‌ బ్రాండ్‌ ‘ఫిట్‌బిట్‌’ తాజాగా ‘ఫిట్‌ బిట్‌ చార్జ్‌ 5’ పేరిట అడ్వాన్స్‌డ్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను మన దేశంలో విడుదల చేసింది. ఫిట్‌నెస్‌, ఒత్తిడి, గుండె, నిద్రపై దృష్టిసారిస్తోంది. అతిముఖ్యమైన ఈసీజీ, ఈడిఏ సెన్సర్లు ఉన్నాయి. చేతి వేళ్ళలో ఉండే తీపి గ్రంథుల్లో వచ్చే మార్పులను సైతం ఈడీఏ సెన్సర్‌ కనుగొంటుంది. మందంగా, అమోల్డ్‌ టచ్‌ స్ర్కీన్‌తో ఈ డివైస్‌ వస్తోంది...

ఫిట్‌ బిట్‌ చార్జ్‌ 5

గూగుల్‌కు చెందిన వేరబుల్‌ బ్రాండ్‌ ‘ఫిట్‌బిట్‌’ తాజాగా ‘ఫిట్‌ బిట్‌ చార్జ్‌ 5’ పేరిట అడ్వాన్స్‌డ్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను మన దేశంలో విడుదల చేసింది. ఫిట్‌నెస్‌, ఒత్తిడి, గుండె, నిద్రపై దృష్టిసారిస్తోంది. అతిముఖ్యమైన ఈసీజీ, ఈడిఏ సెన్సర్లు ఉన్నాయి. చేతి వేళ్ళలో ఉండే తీపి గ్రంథుల్లో వచ్చే మార్పులను సైతం ఈడీఏ సెన్సర్‌ కనుగొంటుంది. మందంగా, అమోల్డ్‌ టచ్‌ స్ర్కీన్‌తో ఈ డివైస్‌ వస్తోంది. ఆరు నెలల ఫిట్‌బిట్‌ ప్రీమియర్‌ మెంబర్‌షిప్‌తో కలిపి దీని ధర రూ.14,999. ఈ ఏడాది చివర్లో ఫిట్‌బిట్‌ వెబ్‌సైట్‌పైనే ఇది మనదేశంలో వినియోగదారులకు లభ్యం కానుంది. వర్కౌట్లకు శరీరం సన్నద్ధంగా ఉందా లేదా అన్నది ప్రతి రోజు ఉదయమే ఇది చెప్పేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తి తన ఆరోగ్యానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ డివైస్‌ ఉపయోగపడుతుంది. దీంట్లో బిల్ట్‌ఇన్‌ జీపీఎస్‌కు తోడు 20 ఎక్స్‌ర్‌సైజ్‌ మోడ్‌లు ఉన్నాయి. 200 వర్కౌట్లు సహా పలు ఫీచర్లతో ఈ డివైస్‌ అలరారుతోంది. 

Updated Date - 2021-08-28T05:55:28+05:30 IST