ఫిట్‌నెస్‌ ఫ్రైడే ఛాలెంజ్‌!

ABN , First Publish Date - 2021-04-01T05:30:00+05:30 IST

‘ఫిట్‌నెస్‌ లక్ష్యాలు పెట్టుకోవడం సులువే. కానీ ఆ లక్ష్యాలను అందుకునేందుకు మొదటి రోజు నుంచి అంకితభావంతో కష్టపడడం

ఫిట్‌నెస్‌ ఫ్రైడే ఛాలెంజ్‌!

‘ఫిట్‌నెస్‌ లక్ష్యాలు పెట్టుకోవడం సులువే. కానీ ఆ లక్ష్యాలను అందుకునేందుకు మొదటి రోజు నుంచి అంకితభావంతో కష్టపడడం అంతే ముఖ్యం’ అంటున్నారు నటి సమీరా రెడ్డి. ఫిట్‌నెస్‌ ఫ్రైడే ఛాలెంజ్‌తో ఒక్క నెలలోనే రెండు కిలోల బరువు తగ్గి చూపించారామె. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను పంచుకున్నారిలా...


‘‘ఎప్పుడైనా అలసిపోయినప్పుడు లేదా పట్టలేనంత సంతోషంలో ఉన్నప్పుడు అమితంగా తినేస్తాను. అయితే కొన్ని నెలలుగా నేను మనసు పెట్టి తినాలనుకుంటున్నాను. కానీ సాధ్యం కావడం లేదు. ఇలా అయితే కాదని ఒక నెల క్రితం నేను ఫిట్‌నెస్‌ ఫ్రైడే ఛాలెంజ్‌ మొదలెట్టాను. అప్పుడు నా బరువు 92 కిలోలు. ఒక్క నెలలో రెండు కిలోలు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఈసారి పక్కాగా ఫిట్‌నెస్‌ మీద పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (కొన్ని గంటల్లోపే తినడం, కొన్ని గంటలు ఫాస్టింగ్‌ ఉండడం) నాకు ఎంతో ఉపయోగపడింది.


రోజులో 16 గంటలు ఉపవాసం, మిగతా ఎనిమిది గంటల్లోపే ఏదైనా తినేదాన్ని. అలాగే నిత్యం యోగా చేసేదాన్ని. ఏం తింటున్నాను, ఎంత తింటున్నాను అనే విషయంలో కచ్చితంగా ఉన్నాను. ఇలా చేయడం వల్ల నా శరీరం తేలికగా అనిపించేది. వేగంగా నడవడం అలవడింది. ఒక్క నెలలోనే నేను 99 కిలోల నుంచి 89.9 కిలోలకు వచ్చాను. రెండు కిలోలు తగ్గాను. ఫిట్‌నెస్‌ ఫ్రైడే టార్గెట్‌ను సాధించాను. 



ఫిట్‌నెస్‌ లక్ష్యాలు పెట్టుకునే వారికి నేను చెప్పేదేమంటే... మీరు మీ లక్ష్యం దిశలో ఎక్కడ ఉన్నారు. గత నెలకు, ఇప్పుడు ఏమైనా తేడా గమనించారా? మీరు అంకితభావంతో ఉన్నారా! అనేవి చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌ లక్ష్యం నిర్ణయించుకున్న మొదటి నెల నిరంతర ప్రణాళికతో ముందుకు సాగాలి.


Updated Date - 2021-04-01T05:30:00+05:30 IST