ఎల్‌ఐసీలో ఐదు రోజుల పని విధానం

ABN , First Publish Date - 2021-05-08T06:31:53+05:30 IST

ఎల్‌ఐసీ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)లో వారానికి ఐదు రోజుల పని దినాలు అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌ 15న కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉద్యోగులు వారంలో ఐదు రోజులు విధులు నిర్వహిస్తున్నారు.

ఎల్‌ఐసీలో ఐదు రోజుల పని విధానం
భువనగిరిలోని ఎల్‌ఐసీ కార్యాలయం

భువనగిరి టౌన్‌: ఎల్‌ఐసీ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)లో వారానికి ఐదు రోజుల పని దినాలు అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌ 15న కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉద్యోగులు వారంలో ఐదు రోజులు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్ర 5గంటల వరకే పనివేళలు కాగా, ప్రస్తుతం అరగంట సమయం పెంచి 5.30 వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 ఎల్‌ఐసీ కార్యాలయాల్లో 700మంది వరకు ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-05-08T06:31:53+05:30 IST