బంగ్లాదేశ్ నదిలో లాంచీ మునిగి ఐదుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-04-05T13:33:21+05:30 IST

బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకా సమీపంలోని నదిలో లాంచీ మునిగిన దుర్ఘటనలో ఐదుగురు

బంగ్లాదేశ్ నదిలో లాంచీ మునిగి ఐదుగురి దుర్మరణం

ఢాకా (బంగ్లాదేశ్): బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకా సమీపంలోని నదిలో లాంచీ మునిగిన దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 12 మంది గల్లంతయ్యారు. డబుల్ డెక్కర్ లాంచీలో 50 మంది ప్రయాణికులతో బంగ్లాదేశ్ లోని నారాయణ్ గంజ్ జిల్లా మదన్ పూర్ వద్ద షీతాలక్ష్య నదిలో ప్రయాణిస్తుండగా కార్గో లాంచీ ఢీకొట్టింది. దీంతో లాంచీ నదిలో మునిగిపోవడంతో 12 మంది గల్లంతు అయ్యారని, మిగిలిన వారు ఈతకొడుతూ ఒడ్డుకు చేరుకున్నారని వాటర్ ట్రాన్స్ పోర్టు అథారిటీ అధికారి ముబారక్ హుసేన్ చెప్పారు. సహాయ సిబ్బంది వచ్చి నదిలో మునిగి మరణించిన వారి శవాలను వెలికితీసే పనిలో మునిగారు.ఈ లాంచీ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీని నియమించారు. భద్రతా నిబంధనలు పాటించక పోవడం వల్లనే నదుల్లో లాంచీల ప్రమాదాలు జరుగుతున్నాయని బంగ్లాదేశ్ ప్రజలంటున్నారు.


Updated Date - 2021-04-05T13:33:21+05:30 IST