Abn logo
Oct 26 2021 @ 21:39PM

తమిళనాడు బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

చెన్నై: తమిళనాడు కల్లకురిచి జిల్లా శంకరాపురం పట్టణంలోని బాణాసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారని జిల్లా కలెక్టర్ పీఎన్ శ్రీధర్ తెలిపారు. ప్రమాదంలో మరో పది మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

TAGS: Tamilnadu

ఇవి కూడా చదవండిImage Caption