Abn logo
Aug 11 2020 @ 03:53AM

వేర్వేరు కారణాలతో ఐదుగురి బలవన్మరణం

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరంతా వేర్వేరు కారణాలతో తమ ఉసురు తీసుకున్నారు.


మఠంపల్లి, ఆగస్టు 10 : ఆర్థిక ఇబ్బందులను  తట్టుకోలేక ఓ పరిశ్రమ యార్డులో పనిచేసే ఉద్యోగి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కోదాడ మండలం కొమరబండకు చెందిన కె.శ్రీనివా్‌సరావు(52) స్థానిక పరిశ్రమలోని కర్రయార్డులో ఉద్యోగిగా పనిచేసేవాడు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివా్‌సరావు హైదరాబాద్‌లో వైద్యచికిత్స చేయించుకున్నాడు. కొంత కాలంగా తనను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సంబంధిత పరిశ్రమ అధికారులను కోరినా వారు చేర్చుకోలేదు.


కుటుంబ భారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనోవేదనకు గురైన ఆయన సోమవారం కూడా విధుల్లో చేర్చుకోవాలని పరిశ్రమ యాజమాన్యాన్ని ఆర్దించినా స్పందించకపోవడంతో పరిశ్రమ సమీపంలో క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు ఆయన్ను ప్రైవేట్‌ వాహనంలో హుజూర్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. శ్రీనివాసరావుకు భార్య పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 ఆర్థిక ఇబ్బందులతో... 

మునగాల: మండలంలోని రేపాల గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడిగూడెం మం డలం వల్లభాపురం గ్రామానికి చెందిన గడ్డం ఇంద్రారెడ్డి(35) ఇటీవల తనకున్న లారీని విక్రయించి అప్పులపాలయ్యాడు. దీంతో తమ అత్తగారి గ్రామమైన రేపాల గ్రామంలో ఎనిమిది నెలల నుంచి ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం లారీలో సిమెంట్‌ లోడ్‌తో సూర్యాపేట వరకు వెళ్లి తిరిగి వచ్చి రేపాల గ్రామ శివారులో ఉన్న సబ్‌స్టేషన్‌ వద్ద నిలిపి లారీ పైకెక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంద్రారెడ్డి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. 


ఆత్మకూర్‌(ఎం)లో వివాహిత

ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన మల్గ లావణ్య(34) తమ వ్యవసాయ బావి వద్ద క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో ఉప్పల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి చేరుకునేలోగా లావణ్య మృతి చెందింది. కారణాలు తెలియరాలేదు.


భార్య కాపురానికి రావడంలేదని..

మునుగోడు రూరల్‌:  భార్య కాపురానికి రావడంలేదని మండలంలోని ఊకొండి గ్రామంలో ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఊకొండి గ్రామానికి చెందిన మేడి లింగస్వామి(30) ఈ నెల 4న తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. లింగస్వామికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. భార్య కాపురానికి రాకపోవడంతో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని లింగస్వామి తల్లి లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రజినీకర్‌ తెలిపారు. 


మానసిక వేదనతో..

చింతపల్లి : మండలంలోని నసర్లపల్లి గ్రామానికి చెందిన దాసరి బక్కయ్య(70) పురుగులమందు తాగి హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దాసరి బక్కయ్య పెద్దకుమారుడు, కోడలు కూడ ఇటివలే మృతి చెందారు. దీంతో వారి పిల్లలను బక్కయ్యే సాకుతున్నాడు.


ఆర్థిక పరిస్థితి బాగాలేక దిక్కుతోచని స్థితిలో బక్కయ్య ఈనెల 7న పురుగులమందు తాగాడు. అతడిని దేవరకొండకు తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాఆసుపత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement