రహదారికి ఇరువైపుల ఐదు వరుసల మొక్కలు

ABN , First Publish Date - 2021-06-14T05:09:47+05:30 IST

జాతీయ రహదారికి ఇరువైపుల ఐదు వరుసల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశామని డీఆర్‌డీవో పీడీ వెంక ట మాధవరావు అన్నారు.

రహదారికి ఇరువైపుల ఐదు వరుసల మొక్కలు
మొక్కలను పరిశీలిస్తున్న దృశ్యం

ఫ డీఆర్‌డీవో పీడీ వెంకట మాధవరావు
భిక్కనూరు, జూన్‌ 13: జాతీయ రహదారికి ఇరువైపుల ఐదు వరుసల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశామని డీఆర్‌డీవో పీడీ వెంక ట మాధవరావు అన్నారు. ఆదివారం మండలంలోని 44వ జాతీయ రహదా రిపై రోడ్లకు ఇరువైపుల ఉన్న చెట్లను పరిశీలించారు. ఈ మేరకు పీడీ మాట్లాడుతూ కలెక్టర్‌ శరత్‌ ఆదేశాల మేరకు మండలంలోని జిల్లా సరిహద్దు బస్వాపూర్‌ నుంచి మండల సరిహద్దు లక్ష్మీనగర్‌తండా వరకు 44వ జాతీయ రహదారికి ఇరువైపుల ఇది వరకే ఉన్న మొక్కలతో పాటుగా ఐదు వరుసల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ కిలో మీటర్‌కు నాలు గు వందల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల అధికారులు, అటవీశాఖ అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనంత్‌రావు, ఎంపీవో ప్రవీణ్‌కుమార్‌, అటవీశాఖ సెక్షన్‌ అధికారి అనురంజని, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-14T05:09:47+05:30 IST