ఉత్తరాఖండ్ వెల్లువెత్తిన వరదలు...ఐదుగురు tourists మృతి

ABN , First Publish Date - 2021-10-22T12:58:19+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల్లో ఐదుగురు పర్యాటకులు మరణించారు...

ఉత్తరాఖండ్ వెల్లువెత్తిన వరదలు...ఐదుగురు tourists మృతి

 డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల్లో ఐదుగురు పర్యాటకులు మరణించారు.బాగేశ్వర్ జిల్లా కుమావ్ ప్రాంతంలోని సుందర్దుంగా హిమనీనదంలో ఐదుగురు పర్యాటకులు మరణించగా, మరో పర్యాటకుడు తప్పిపోయాడని అధికారులు చెప్పారు. బాగేశ్వర్ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో సంభవించిన వరదల్లో నుంచి నలుగురిని రక్షించినట్లు బాగేశ్వర్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి శిఖా సుయాల్ చెప్పారు. ఉత్తరాఖండ్ వరదల్లో 65 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. కఫ్నీ వద్ద 20 మంది, ద్వాలీ హిమనీనదం వద్ద 34 మంది, సుందర్ దుంగాలో 10 మంది చిక్కుకున్నారని అధికారులు చెప్పారు.కోల్‌కతా నుంచి వచ్చి వరదల్లో చిక్కుకున్న పర్యాటకులను రక్షించడానికి డెహ్రాడూన్ నుంచి ఒక హెలికాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందం, మూడు రెస్క్యూ టీంలను  పంపించామని అధికారులు చెప్పారు.


 ద్వాలీ హిమనీనదంలో చిక్కుకున్న 22మంది పర్యాటకులను రక్షించామని  బాగేశ్వర్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి శిఖా సుయాల్ చెప్పారు. పితోరాఘర్ జిల్లాలోని దర్మా, వ్యాస్ లోయల్లో చిక్కుకున్న 60 మంది పర్యాటకులను భారత సైన్యం చినూక్ హెలికాప్టర్లు గురువారం రక్షించాయని జిల్లా పరిపాలన వర్గాలు తెలిపాయి.చోటా కైలాష్‌ను సందర్శించడానికి ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చిన 30 మంది పర్యాటకులు గత ఐదు రోజులుగా చిక్కుకుపోయారు.దీంతో వారిని పితోర్ గడ్ విమానాశ్రయానికి తీసుకువచ్చామని జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ చౌహాన్ చెప్పారు. 


Updated Date - 2021-10-22T12:58:19+05:30 IST